GNTR: కాకుమాను మండలం కొమ్మూరు గ్రామానికి చెందిన నక్కల శైలజను గుంటూరు టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధిగా నియమిస్తూ టీడీపీ అధిష్ఠానం జాబితా విడుదల చేసింది. శైలజ 2015 నుంచి 2019 వరకు ఎంపీపీగా పదవి నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. టీడీపీ మండల నాయకులు, గ్రామస్థులు తనను సొంత ఆడబిడ్డలా చూశారన్నారు. తనకు పదవి రావడానికి గ్రామస్థుల సహకారం ఉందనీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.