తమిళనాడు (Tamil Nadu) నీలగిరి జిల్లా కోటగిరిలోని ఓ టీ ఎస్టేట్ కంపెనీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీపావళికి భారీ కానుక ఇచ్చింది. ఫెస్టివల్ గిఫ్ట్‌గా రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు (Royal Enfield bikes) ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.రూ. 2.50 లక్షల నుంచి రూ. 3 లక్షల వరకు ఉండే క్లాసిక్ 350 హిమాలయన్, హంటర్, మోడల్స్ బైకులను బహుకరించింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారడంతో ఈ విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు. అలాగే కొందరు తాము ఉద్యోగం చేస్తున్న కంపెనీ తమకు కూడా ఇస్తే బాగుండని అనుకుంటున్నారు. దీపావళి పండుగ(Diwali festival)కు అన్ని షాపింగ్ మాల్స్‌లో ఆఫర్‌ని ప్రకటిస్తారు.
అలాగే ఏ వస్తువు కొనాలన్నా తక్కువ డబ్బుతోనే కొనేయెచ్చు. మిగతా సమయంలో ఏది కొనుగోలు చేయాలన్నా రేట్లు భారీగా ఉంటాయి. కానీ దీపావళి పండుగకు ఆఫర్స్ కారణంగా చాలా తక్కువకే వస్తాయి. కాబట్టి సామాన్యులు ఎక్కువగా దీపావళి ఆఫర్స్లోనే పలు సామాన్లు కొనుకుంటారు. అయితే ప్రతి ఉద్యోగి పలు కంపెనీలు దీపావళి రోజున, బోనస్‌లు (Bonuses), లేదా స్వీట్ బాక్సులు ఇస్తుంటారు. అలాగే కొందరు బట్టలు కూడా ఇస్తుంటారు. దీంతో ఉద్యోగులు (Employees) చాలా సంతోషిస్తారు. తాజాగా, ఓ కంపెనీ ఉద్యోగులు గాలిలో తేలిపోయే గిఫ్ట్ ఇచ్చారు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌నే కానుకగా ఇచ్చేశారు.