»Air Pollution In Delhi At Dangerous Level Schools Closed For Two Days
Air pollution : ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం.. రెండు రోజులు స్కూళ్లు బంద్
దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. ఎయిర్ క్వాలిటీ రోజురోజుకూ తగ్గిపోతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు .స్కూల్‌కి రెండు రోజులు సెలవులు ప్రకటించారు
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో వాయు కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. ఒక్కసారిగా గాలి నాణ్యత పడిపోవడంతో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది.ఎయిర్ క్వాలిటీ రోజురోజుకూ తగ్గిపోతుండటంపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి చలి తోడవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 8 గంటలు దాటినప్పటికీ నగరాన్ని పొగ చుట్టేసింది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. దీంతో అప్రమత్తమైన సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రభుత్వం ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలకు (Primary schools) సెలవులు ప్రకటించారు. శుక్ర, శనివారాల్లో బడులకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆన్లైన్ విధానంలో తరగతులు నిర్వహించాలని స్పష్టం చేసింది. కాగా, కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో అనవసరమైన నిర్మాణ పనులపై నిషేధం విధించింది. అదేవిధంగా వాయు కాలుష్యాన్ని నియంత్రిచండానికి డీజిల్ వాహనాల రాకపోకలపై నియంత్రణ విధించింది.వాయు కాలుష్యం (Air pollution) పెరుగుతున్నందున ఢిల్లీలో సరిబేసి విధానం అమలు చేయడంపై ఆలోచిస్తున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు.