»Shreyas Iyer Hit A Huge Six In The World Cup Here Is The Video
Shreyas Iyer : వరల్డ్ కప్‌లో భారీ సిక్సర్ కొట్టిన శ్రేయాస్ అయ్యర్.. వీడియో ఇదిగో!
శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా ఫామ్ లోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. భారత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో ఇప్పటివరకు అందరికంటే భారీ సిక్సర్ కొట్టిన ఆటగాడిగా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు.
శ్రీలంక(Sri Lanka)తో మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత సాధించాడు. శ్రీలంక మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చిన శ్రేయస్ భారత్ గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ (World Cup)లో ఇప్పటి వరకు అందరికంటే భారీ సిక్సర్ కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో తొలుత టీమిండియా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ గిల్ అవుట్ కావడంతో బరిలోకి దిగిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సొంత గడ్డపై బ్యాటుతో ఒక ఆట ఆడుకున్నాడు. లంకా పెసర్ రజిత (Rajita) వేసిన ఓ ఆఫ్ వాలిని లాంగ్ ఆఫ్ దిశగా భారీ సిక్సర్ కొట్టాడు. ఇది 106 మీటర్ల దూరం వెళ్ళింది స్టేడియం లో స్టాండ్స్ కు తగిలి కింద పడింది. ఈ వరల్డ్ కప్ లో ఇది అత్యంత భారీ సిక్సర్ దాంతో ఆసిస్ ఆటగాడు లేని మాక్స్వెల్ కొట్టిన 104 మీటర్ల సిక్సరు కనుమరుగైంది.
ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యారు 56 బంతుల్లో 82 పరుగులు చేశాడు ఈ స్కోర్ లో మూడు ఫోర్లు ఆరు భారీ సిక్సులు ఉన్నాయి రోహిత్ సారధ్యంలోని టీమిండియా (Team India) వరల్డ్ కప్ 2023లో విజయాల పరంపరను కొనసాగిస్తోంది. మరింత మెరుగైన ఆటతీరును కనబరుస్తూ శెభాష్ అనిపించుకుంటోంది. గురువారం శ్రీలంకపై చరిత్రాత్మక గెలుపుని సొంతం చేసుకుంది. ముంబై (Mumbai)లోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఏకంగా 302 పరుగుల తేడాతో గెలిచింది. గ్రూప్ దశలో భారత్ ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) వేదికగా దక్షిణాఫ్రికాను ఢీకొట్టనుంది. నెదర్లాండ్స్‌పై చివరి మ్యాచ్‌ను ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలిస్తే అగ్రస్థానంలో నిలబడుతుంది. ఒకవేళ రెండింటిలోనూ ఓడిపోతే మాత్రం 2వ స్థానంలో నిలిచే అవకాశం ఉంటుంది.