»Poultry Farmers Contest Against Cm Kcr At Kamareddy
KCRపై 100 మంది ఫౌల్ట్రీ రైతుల పోటీ.. ఎక్కడంటే..?
సీఎం కేసీఆర్ పోటీ చేసే రెండో స్థానం కామారెడ్డిలో 100 మంది ఫౌల్ట్రీ రైతులు పోటీ చేస్తారని తెలిసింది. ఇప్పటికే 1016 మంది లంబాడీలు కూడా నామినేషన్ వేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Pension Will Also Be Given To Those Who Do New Beedis: KCR
CM KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీగా ఉన్నారు. ప్రధాన పార్టీల అధినేతలు రాష్ట్రమంతా చుట్టి వస్తున్నారు. ఈ సారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (CM KCR) రెండు చోట్ల బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలో కూడా పోటీకి దిగుతున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్దన్‌కు హ్యాండ్ ఇచ్చి.. కేసీఆర్ పోటీకి దిగుతున్నారు.
కామారెడ్డి నుంచి కేసీఆర్ బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ 1016 నామినేషన్లు వేస్తామని కాయితీ లంబాడీలు ప్రకటించారు. ఆ విషయం అలా ఉండగా.. ఇప్పుడు ఫౌల్ట్రీ రైతులు ముందుకు వచ్చారు. కామారెడ్డిలో 100 మంది పోటీ చేస్తారని తెలుస్తోంది. గురువారం కామారెడ్డిలో ఫౌల్ట్రీ రైతుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఆ సమావేశంలోనే బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
అంటే కేసీఆర్ మీద లంబాడీలు, ఫౌల్ట్రీ రైతులు కూడా పోటీ చేయనున్నారు. ఇక కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఉండనే ఉన్నారు. గత ఎన్నికల్లో నిజామాబాద్ లోక్ సభ నుంచి కూడా భారీగా రైతులు బరిలోకి దిగారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని అర్వింద్ హామీ ఇవ్వడంతో.. ఆయనను గెలిపించారు. ఇప్పుడు కామారెడ్డిలో ఈ స్థాయిలో పోటీ చేయనుండటం ఆసక్తికరంగా మారింది. అదే జరిగితే బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగుతుంది.