DA: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పెండింగ్లో ఉన్న డీఏ (DA) విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం అంగీకరించింది. ఉద్యోగులకు మూడు డీఏ (DA) ఇవ్వాల్సి ఉంది. అందులో ఒక డీఏ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ఈసీని ప్రభుత్వం కోరింది. దానికి ఎన్నికల సంఘం అంగీకరించింది.
తెలంగాణ రాష్ట్రంలో రేపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ఉండగా.. డీఏ (DA) విడుదల ఆగింది. తాజాగా ప్రభుత్వం ఈసీని కోరగా.. మూడు డీఏలు (DA) ఎందుకు పెండింగ్ పెట్టారని అడిగినట్టు తెలిసింది. దానికి ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సంతృప్తిగా ఉంది. దీంతో ఒక డీఏ ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వమే కాదు.. ఉద్యోగ సంఘాలు కూడా డీఏ (DA) విడుదల గురించి ఈసీ దృష్టికి తీసుకొచ్చాయి. తమకు డీఏ (DA) ఇవ్వాలని కోరాయి. పోలింగ్ ముగిసిందని.. ఇకనైనా ఇవ్వాలని కోరగా.. ఈసీ ఆమోద ముద్ర వేసింది.