YS Sharmila: కేసీఆర్ పాలనకు ఎండ్ కార్డ్ పడబోతుందని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. కేసీఆర్ ప్యాక్ అప్ చేసుకునే టైం వచ్చిందని.. అందుకే ఒక గిఫ్ట్ ఇస్తున్నామని తెలిపారు. బైబై కేసీఆర్ అని ఉన్నా సూట్ కేసు పంపించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ఎందుకు పోటీ చేయలేదో స్పష్టంచేశారు. 2018, 2023 ఎన్నికల్లో పది వేల తేడాతో గెలిచిన ఎమ్మెల్యేలు 33 మంది మాత్రమేనని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల్లో 71 మంది పది వేల మెజార్టీతో గెలిచారని గుర్తుచేశారు. పోటీ చేసి 5 వేల ఓట్లు చీల్చినా తేడా వస్తుందని ఎన్నికలకు దూరంగా ఉన్నామని వివరించారు. కేసీఆర్ను ఓడించాలని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చామని అంటున్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ కలిసే ఉన్నాయని తెలంగాణ ప్రజలకు అర్థం అయ్యిందని షర్మిల (Sharmila) పేర్కొన్నారు. కేసీఆర్ అవినీతి మీద యాక్షన్ తీసుకోలేదని గుర్తుచేశారు. ఆ రెండు పార్టీలు తోడు దొంగలు అయి కలిసే ఉన్నాయని ఆరోపించారు. కేసీఆర్ను మించిన కరెప్ట్ పొలిటిషీయన్ లేరని అమిత్ షా చెప్పారు. ఏ స్కీం చేసినా అవినీతే అని ప్రధాని మోడీ చెప్పారు. కలిసి లేకపోతే.. ఎంక్వెరీ వేయాలని కోరినా.. యాక్షన్ ఎందుకు తీసుకోలేదని అడిగారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటేనని తెలిపారు. 2014, 2018లో 45 మందిని కేసీఆర్ కొనుగోలు చేశాడని.. ఇది మళ్లీ రిపీట్ కాకూడదని అభిప్రాయ పడ్డారు. బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి అధికారంలోకి వచ్చే విధంగా చేయకూడదని కేసీఆర్ను డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో క్రెడిబిలిటీ ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం మారాలని షర్మిల అభిప్రాయపడ్డారు. ఎవరు సీఎం కావాలన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. రేవంత్ రెడ్డి అని చూడటం లేదు. ప్రభుత్వం మారాలి. కేసీఆర్ సీఎం కాకూడదని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఉత్తమ్ ఆర్మీలో పనిచేసిన వ్యక్తి. భట్టి దళితుడు, పాదయాత్ర చేశారు. మిగతా వల్ల లాగా కార్లలో తిరగలేదు. కాంగ్రెస్ పార్టీలో క్రెడిబిలిటీ ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం మారాలి.. ఎవరు సీఎం కావాలన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుందని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు.