»Is This Your Rites Sharmila Fires On Jagan Over Late Leader Ysr Jayanti
YS Sharmila: ఇదేనా నీ సంస్కారం.. జగన్పై షర్మిల ఫైర్
మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు.. ఇలాగేనా ఆయన 75 జయంతిని నిర్వహించేది. మీ రాజకీయ పార్టీలకు పెద్ద పెద్ద సభలు పెట్టారు కదా సొంత తండ్రి కోసం అందరూ కలిసి కూడా నివాళ్లు అర్పించలేదు అని ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల పేర్కొన్నారు.
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీ అధినేత జగన్పై విరుచుకుపడ్డారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా జగన్ తీరును ఎండగట్టారు. ఏదో మొక్కుబడిగా చేశారు తప్ప గుండెల్లో ప్రేమ లేదన్నారు. సొంత తండ్రి, అందులో దేశం గర్వించదగ్గ నేత జయంతిని గౌవరంగా చేయలేదని షర్మిల విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు షర్మిల. “వైఎస్సార్ 75వ జయంతి కోసం జగన్ ఇడుపులపాయకు వెళ్లి ఏం చేశారు, కనీసం అక్కడ ఐదు నిమిషాలు కూడా లేరు. కేర్చోలేదు. ఏదో తూతూ మంత్రంలా నివాళులు అర్పించారు. ఇలాగేనా సొంత తండ్రి జయంతి జరిపేది.
ఆయన రాజకీయ సభలు, ‘సిద్ధం’ అంటూ, హోర్డింగ్లతో హంగమా చేశారు. ఒక్కో సభకు రూ.30 కోట్లు, రూ.40 కోట్లు ఖర్చు పెట్టారు. అలాంటి రాజశేఖర్ రెడ్డి గారి కోసం ఒక్క సభను ఎందుకు ఏర్పాటు చేయలేదు. సభ పెట్టకపోగా.. వైసీపీ నేతలంతా కలిసి నివాళులు సైతం అర్పించలేకపోయారు. ఆయన జయంతి మీకు స్పెషల్ కాదా.. ఇలాగేనా జరిపేది”. అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ..” మా నాయకుడు, మా తండ్రి, మా పార్టీ నేత కాబట్టే ఆయన కోసం అంత పెద్ద సభ నిర్వహించాము. ఓ ముఖ్యమంత్రి, పక్క రాష్ట్రంలోని మంత్రులు, కీలక నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి అగ్రనేతలు ఆయనకు నివాల్లు అర్పించారు. మీరు ఏం చేశారు? మీరా రాజశేఖర్ రెడ్డి వారసులు” అని షర్మిల నిప్పులు చెరిగారు.
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి గారు చనిపోయి దాదాపు 15 ఏళ్లు అవుతుంటే ఆయన జయంతి మీకు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా? ఆ మహానేత జయంతిని కానీ, వర్ధంతిని కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా చేసిందా? ఇప్పుడు మీరు చెబుతున్న కొంతమంది ఆ మహానేతను ఎంతగా విమర్శించారో మ… pic.twitter.com/eDvw4PHOb4