Counting details in how many rounds in 119 constituencies
TS POLL Counting: మరికొన్ని గంటల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 119 నియోజకవర్గాలకు చెందిన ఈవీఎం బాక్సులను ఉదయం 8 తర్వాత తెరుస్తారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కించి.. తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు. ఒక్కో నియోజకవర్గంలో ఎన్ని రౌండ్స్ ఉన్నాయి..? ఎన్ని టేబుల్స్ (tables) ఏర్పాటు చేశారు.
అత్యల్పంగా
భద్రాచలంలో కేవలం 13 రౌండ్లలో కౌంటింగ్ ముగియనుంది. ఆ తర్వాత ఆశ్వారావు పేటలో.. ఇక్కడ 14 రౌండ్లలో ఫలితం తేలనుంది. ఇక సిటీలో చార్మినార్లో కేవలం 15 రౌండ్లలో ఫలితం తేలనుంది. సికింద్రాబాద్లో 16 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ముగియనుంది. ఆర్మూర్లో కూడా 16 రౌండ్లలో ఫలితం రానుంది.
అత్యధికంగా
జూబ్లీహిల్స్ అత్యధికంగా 26 రౌండ్ల తర్వాత అభ్యర్థి విజయం ఖరారు కానుంది. యాకత్ పురలో 25 రౌండ్లు ఉన్నాయి. క్కడ పోలింగ్ పర్సంటేజీ తక్కువగా నమోదైంది. సో.. ఫలితం త్వరంగా వచ్చే అవకాశం ఉంది. బండి సంజయ్ పోటీ చేసిన కరీంనగర్లో 25 రౌండ్లు, ఇబ్రహీంపట్నం కూడా సేమ్ అంతే మొత్తం ఉన్నాయి. కార్వాన్, చొప్పదండిలో 24 రౌండ్లు.. దేవరకొండ, ఆలేరు, భూపాలపల్లి, ఖమ్మం, ముధోల్, మానకొండూర్, పటాన్ చెరు, గజ్వేల్, శేరిలింగంపల్లిలో 23 రౌండ్లలో ఫలితం రానుంది.
ప్రముఖుల సీట్లు
సీఎం కేసీఆర్ పోటీ చేసిన రెండో సీటు కామారెడ్డిలో 19 రౌండ్లలో ఫలితం రానుంది. ట్రెండ్ ప్రకారం కేసీఆర్ మూడో స్థానంలో నిలుస్తారని సమాచారం. ఈటల రాజేందర్ పోటీ చేసిన హుజురాబాద్లో 22 రౌండ్లు.. మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహించిన సిద్దిపేటలో 20 రౌండ్లు.. రేవంత్ రెడ్డి పోటీ చేసిన కొడంగల్లో 20 రౌండ్లలో ఫలితం రానుంది. మంత్రి కేటీఆర్ పోటీ చేసిన సిరిసిల్లలో 21 రౌండ్లలో విజయం ఖాయం అవనుంది.