»It Raids The House Of Ex Minister Jana Reddy Inquire About Business Transactions
Breaking News : మాజీ మంత్రి జానారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్.. వ్యాపార లావాదేవీలపై ఆరా
మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఈ సోదాలు జరగుతుండటం సంచలనం రేపుతుంది. జానారెడ్డి కుమారుడు రఘవీర్ రెడ్డి వ్యాపార లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.
తెలంగాణ(Telangana)లో పలువురు రాజకీయ నేతల ఇళ్లల్లో ఐటీ రైడ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో ఉదయం ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. విస్పర్ వ్యాలీ విల్లాస్ లో తనిఖీలు జరుగుతుండగా, ఆయన కుమారుడి వ్యాపార లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. మొత్తం 18 చోట్ల కాంగ్రెస్ నేతల (Congress leaders) ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి.అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రైడ్స్ (IT Rides) సంచలనం రేపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు చేపట్టిన ఐటీ అధికారులు.. రెండవ రోజు కూడా తనిఖీలు కొనసాగిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుండే అధికారులు ముమ్మరంగా సోదాలు మొదలుపెట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో కాంగ్రెస్ నేతలకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో 18 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు. మహేశ్వరం నియోజవర్గ కాంగ్రెస్ నేత పారిజాత నర్సింహారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కేఎల్ఆర్ ఇంట్లో రెండవ రోజు తనిఖీలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి (Ex Minister Jana Reddy) నివాసంలోనూ ఐటీ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. జానారెడ్డి తనయుడు, నాగర్జునసాగర్ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి (Raghuveer Reddy) వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న క్రమంలో కాంగ్రెస్ అభ్యర్థుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగడం హాట్ టాపిక్‌గా మారింది.