»Sucharita Mohanty Congress Leader Who Gave Back Ticket
Sucharita Mohanty: టికెట్ వెనక్కి ఇచ్చిన కాంగ్రెస్ నాయకురాలు
లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. పూరీ లోక్‌సభ అభ్యర్థి సుచరిత మొహంతీ తన టికెట్‌ను వెనక్కి ఇచ్చేశారు. ప్రచారం చేయడానికి తనకి పార్టీ నుంచి నిధులు అందడం లేదనే కారణంతోనే టికెట్ వెనక్కి ఇచ్చేశారు.
Sucharita Mohanty: Congress leader who gave back ticket
Sucharita Mohanty: లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. పూరీ లోక్‌సభ అభ్యర్థి సుచరిత మొహంతీ తన టికెట్‌ను వెనక్కి ఇచ్చేశారు. ప్రచారం చేయడానికి తనకి పార్టీ నుంచి నిధులు అందడం లేదన్నారు. సొంతంగా ఖర్చులను భరించే స్తోమత తనకు లేదని, అందుకే పోటీ నుంచి విరమించుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాశారు.
పార్టీ నిధులు ఇవ్వకపోవడం వల్ల పూరీలో ప్రచారానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయం ఏఐసీసీ ఒడిశా ఇన్ఛార్జ్కి చెబితే నన్నే డబ్బులు పెట్టుకోమని తెలిపారు. క్రౌడ్ ఫండింగ్‌తో ప్రజల నుంచి విరాళాలు కోరిన పెద్దగా ఫలితం లేదన్నారు. పార్టీ నుంచి నిధులు రాకపోతే ప్రచారం చేయలేను. అందుకే నా టికెట్ వెనక్కి ఇచ్చేస్తున్నా అని ఆమె లేఖలో తెలిపారు. పూరీ లోక్‌సభ స్థానానికి ఆరో విడతలో భాగంగా మే 25న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ప్రక్రియకు మే 6 ఆఖరు తేదీ. అయితే సుచరిత ఇప్పటివరకు నామినేషన్ దాఖలు చేయలేదు. నామినేషన్ల గడువు ముగియనుండగా.. ఆమె పార్టీ టికెట్ వెనక్కి ఇచ్చేసింది. మరి ఈమె స్థానంలో ఎవరైనా పోటీ చేస్తారా లేదా చూడాలి.