»Summer Record High Temperatures Six People Died Due To Sunstroke
Summer: రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. వడదెబ్బతో ఆరుగురి మృతి
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈరోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. కొన్ని మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి.
Summer: Record high temperatures. Six people died due to sunstroke
Summer: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈరోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. కొన్ని మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. సూర్యాపేట, జగిత్యాల, ఖమ్మం, ముదిగొండలో 46.7 డిగ్రీలు నమోదైంది. గత పదేళ్ల నుంచి మే నెలలో నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం. నిర్మల్, మహబూబ్నగర్, మేడ్చల్ మల్కాజగిరి, నిజమాబాద్, ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో 45.2 నుంచి 45.8 డిగ్రీ మధ్య ఉంది. వడదెబ్బకి అక్కడక్కడే కొందరు చనిపోయారు.
ఎండవేడికి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోతున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. మరికొందరు చికిత్స్ తీసుకుంటూనే చనిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ నెల 6, 7 తేదీల్లో పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచించింది. శని, ఆదివారాల్లో మాత్రం అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని, పలు జిల్లాలకు వడగాలుల ముప్పు ఉందని హెచ్చరించింది.