»90s Ott Web Series Review How About Sivaji Middle Class Family Series
90s OTT Web Series Review: శివాజీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సిరీస్ ఎలా ఉందంటే?
శివాజీ, వాసుకీ ప్రధాన పాత్రల్లో నటించిన 90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. 90sలో మధ్య తరగతి కుటుంబం నేపథ్యంలో వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
మధ్య తరగతికి చెందిన చంద్రశేఖర్(శివాజీ) ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టారు. తన పిల్లలను క్రమశిక్షణతో పెంచుతుంటారు. ఆయన భార్య రాణి (వాసుకీ ఆనంద్) మధ్యతరగతి ఆప్యాయతలు, ఆలోచనలతో జీవిస్తుంటారు. వీళ్ల పెద్ద కుమారుడు రఘుతేజ (మౌళి తనూజ్ ప్రశాంత్) పదో తరగతిలో స్టేట్ ఫస్ట్ వస్తాడనే నమ్మకంతో శివాజీ ఉంటాడు. ఇక అమ్మాయి దివ్య (వసంతిక) భవిష్యత్తు గురించి, చదువు బుర్రకెక్కని అర్జున్ (రోహన్) గురించి ఆలోచిస్తూ.. ఆర్థిక ఇబ్బందుల మధ్య కుటుంబాన్ని నడిపిస్తుంటారు. అయితే రఘుతేజ సుజిత (స్నేహల్)ను ప్రేమిస్తాడు. అలాగే క్రికెట్ కూడా తనకి ఇష్టం. తండ్రి ఆశించినట్టు రఘుతేజకు పదో తరగతిలో జిల్లా ఫస్ట్ ర్యాంకు వచ్చిందా? కుటుంబంలో ఆర్థికంగా ఇబ్బందిపడిన పరిస్థితులేంటి? ఉపాధ్యాయుడిగా చంద్రశేఖర్ సాధించే ఘనత ఏంటి? రఘు ప్రేమ సంగతి ఏమైంది? అనేది ఈ సిరీస్ స్టోరీ. ఎలా ఉందంటే?
జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి వెళ్లిన చిన్ననాటి సంగతులను మర్చిపోలేం. పాఠశాల నుంచి కాలేజీ వరకు గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తుపెట్టుకుంటాం. ఈకాలంలో అయితే స్మార్ట్ఫోన్లు వచ్చేశాయి. కానీ ఒకప్పటి రోజుల్లో పలకరించుకోవాలంటే ల్యాండ్ఫోన్లు ఉత్తరాలు, గ్రీటింగ్ కార్డులు తప్ప వేరే దారి లేదు. అయితే ఇలాంటి సన్నివేశాలను తెరపై అందంగా ఆవిష్కరించాడు. ఆరు ఎపిసోడ్స్ కలిగిన ఈ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులకు చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఈ సిరీస్ ఎక్కువగా 90s వాళ్లకు బాగా కనెక్ట్ అవుతుంది. ఎవరెలా చేశారంటే?
శివాజీ చంద్రశేఖర్ పాత్రలో లెక్కల మాస్టార్‌గా ఎంతో ఒదిగిపోయాడు. శివాజీ మధ్యతరగతి తండ్రికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచాడు. గృహిణి రాణిగా వాసుకీ నటన కూడా అద్భుతంగా ఉంటుంది. రఘు పాత్రలో మౌళి నటన కూడా సహజంగా ఉంటుంది. ఆదిత్యగా నటించిన రోహన్ క్యారెక్టర్ నవ్వులు పంచుతుంది. సాంకేతిక అంశాలు
సంగీతం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ అన్ని బాగున్నాయి. అనుకున్న విధంగా.. అప్పటి కాలానికి తగ్గట్టుగా దర్శకుడు చూపించాడు. బలాలు
+నటీనటుల నటన
+కథ, దర్శకత్వం
+సాంకేతిక విభాగం పనితీరు బలహీనతలు
-కొన్ని సన్నివేశాల్లో నెమ్మదిగా సాగే కథనం రేటింగ్:3/5