Tirupati Laddu : తిరుమల నుంచి అయోధ్యకు లక్ష లడ్డూలు
అయోధ్య రామ మందిరం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తోంది. మరో 17 రోజుల్లో భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన రామాలయం తెరవబడుతుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
Tirupati Laddu : అయోధ్య రామ మందిరం విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తోంది. మరో 17 రోజుల్లో భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన రామాలయం తెరవబడుతుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా తిరుపతి లడ్డూలను అక్కడికి పంపిస్తామని ఆలయ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని చెప్పారు. అయోధ్యకు లక్ష లడ్డూలు అందజేస్తామని ధర్మారెడ్డి వెల్లడించారు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు తిరుమలలో ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నామని, ఈ సదస్సుకు దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరవుతారని వెల్లడించారు. మరోవైపు నకిలీ వెబ్సైట్లకు శ్రీవారి భక్తులు మోసపోవద్దని సూచించారు. ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి సౌకర్యాలను అధికారిక వెబ్సైట్ ttdevasthanams.ap.gov.inలో మాత్రమే బుక్ చేసుకోవాలని ఆలయ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.