»Stray Dog Attacked Mother And Child Ultimately Saved Life With Great Difficulty
Viral Video : ప్రాణాలకు తెగించి కుక్క బారినుంచి తన బిడ్డను కాపాడుకున్న తల్లి
కుక్కలు, మనుషుల మధ్య చాలా ప్రేమపూర్వక సంబంధం ఉంది. అవి మానవులకు మంచి స్నేహితులుగా పరిగణిస్తారు. ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు కుక్కలు చాలా విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు.
Viral Video : కుక్కలు, మనుషుల మధ్య చాలా ప్రేమపూర్వక సంబంధం ఉంది. అవి మానవులకు మంచి స్నేహితులుగా పరిగణిస్తారు. ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు కుక్కలు చాలా విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ విషయాలన్నీ పెంపుడు కుక్కలకు వర్తిస్తాయి. కానీ వీధి కుక్కలు అలా కాదు అవి చాలా ప్రమాదకరం. మీరు ఇప్పటి వరకు కుక్కలకు సంబంధించిన వీడియోలు చాలా చూసే ఉంటారు. ప్రస్తుతం అలాంటి మరో వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఒక మహిళ తన బిడ్డను కుక్క నుండి రక్షించుకోవడానికి తన ప్రాణాలను ఫణంగా పెట్టింది.
వీధికుక్కలకు సంబంధించిన ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడల్లా ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. వీటిపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. వీడియోలో ఒక మహిళ తన పిల్లలతో వెళ్తున్నట్లు, అదే సమయంలో ఒక వీధి కుక్క తన బిడ్డపై దాడి చేయాలని ఆలోచిస్తున్నట్లు మీరు చూడవచ్చు. కుక్క ఆ స్త్రీని దారుణంగా వెంబడించింది. భయపడిన స్త్రీ కుక్క నుండి తప్పించుకోవడానికి తన శక్తినంతా ఉపయోగిస్తుంది. చివరికి ఒక వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి కుక్క నుండి స్త్రీని రక్షించడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తాడు. ఈ విధంగా స్త్రీ తనను తాను రక్షించుకోగలుగుతుంది. ఈ వీడియో @DeepikaBhardwaj అనే ఖాతా ద్వారా ట్విటర్లో షేర్ చేయబడింది. ఇప్పటికి 22 లక్షల మందికి పైగా ప్రజలు దీనిని చూశారు.
Can street dog lovers please share how can human beings protects themselves and their kids in such situations since you say it is only human beings always at mistake ? pic.twitter.com/yoTJteuLJc
— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) January 3, 2024