»Weather Heavy Rains In Ap And Telangana Till May 23
Weather: మే 23 వరకు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
ఏపీ, తెలంగాణలో మే 23 వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలిపింది.
Weather: Heavy rains in AP and Telangana till May 23
Weather: ఏపీ, తెలంగాణలో మే 23 వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయి. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించింది. సముద్రమట్టానికి 3.1 కి.మీ ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.
ఇవి తమిళనాడులోని ఉత్తరప్రాంతాల వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీనివల్ల ఏపీ, తెలంగాణలో మే 23 వరకు మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రేపటికి బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతీ రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.