»Jhanvi Kapoors Neck Necklace With The Name Of Boyfriend Shiku Viral
Jhanvi Kapoor: జాన్వీ కపూర్ మెడలో భాయ్‌ఫ్రెండ్ పేరుతో నక్లెస్.. వైరల్
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ మెడలో కన్పించిన ఓ నక్లెస్ గురించి ఇప్పుడు బీటౌన్‌లో చర్చ నడుస్తుంది. దానిపై తన భాయ్‌ఫ్రెండ్ పేరు ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై జాన్వీ సైతం స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్.
Jhanvi Kapoor's neck necklace with the name of boyfriend Shiku.. Viral
Jhanvi Kapoor: బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్(Janhvi Kapoor).. గురించి ఒక విషయం బీటౌన్‌లో చర్చనీయాంశం అయింది. జాన్వీ ముంబైలో మైదాన్ అనే సినిమా స్క్రీనింగ్ వేడుకలో పాల్గొంది. అజయ్ దేవగన్, కృతి శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని జాన్వీ తండ్రి బోనీ కపూర్ నిర్మించారు. ఈ స్క్రీనింగ్ ఈవెంట్లో జాన్వీ స్పెషల్ ఎంట్రాక్షన్‌గా నిలిచింది. వైట్ పాంట్సూట్లో వచ్చిన జాన్వీ మెడలో ఒక నక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఆ హారంపై తన భాయ్‌ఫ్రెండ్ షీకూ పేరు రాసి ఉన్నట్లు అక్కడి సెలబ్రెటీలు, మీడియా గుర్తించింది. జాన్వీ భాయ్‌ఫ్రెండ్ శిఖర్ పహరియా ముద్దు పేరు షీకూ. అయితే ఇటీవలే కరణ్ జోహార్‌తో కాఫీ విత్ కరణ్ ఫోలో షీకూ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. షోలో భాగంగా స్పీడ్ డయల్ లిస్టులో ఉన్న ముగ్గురు పేర్లను చెప్పాలంటే అందులో షీకూ పేరును చెప్పింది.
ఈ షోలో కరణ్ తమ ప్రేమ వ్యవహారంపై ప్రశ్నలు అడిగారు. జాన్వీ కపూర్, శిఖర్ పహరియాతో ప్రేమలో ఉందని అయితే ఈ విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ కథనం ఉందని, ముందు శిఖర్‌తో డేటింగ్లో ఉండేది అని, ఆ తర్వాత మరొకరితో డేటింగ్ చేశారని, మళ్లీ ఇప్పుడు శిఖర్‌తో డేటింగ్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమా.. కాదా అని కరణ్ అడిగారు. దానికి జాన్వీ బదులిస్తూ.. నాదాన్ పరిందే ఘర్ ఆజా పాటను తనకోసం షీకూ పాడి వినిపించేవాడని ఆమె అన్నారు. శిఖర్ తనకు ముందు నుంచి మంచి స్నేహితుడు అని చెప్పింది. తన నుంచి శికర్ ఏదో ఆశిస్తున్నాడని తాను అనుకోవడం లేదని, వారి స్నేహంలో ఎటువంటి స్వార్థం లేదని జాన్వీ చెప్పుకొచ్చింది. అయితే ఆ నక్లెస్ ఫ్రెండ్షిప్ కోసమే ఇచ్చాడని జాన్వీ సన్నిహితులు చెబుతున్న మాట.