»Gopichands Hit Movie Bheema In Ott When And Where
Bheema: ఓటీటీలో గోపిచంద్ హిట్ మూవీ… ఎప్పుడంటే?
గోపిచంద్ హీరోగా వచ్చిన తాజా చిత్రం భీమా ఓటీటీలోకి రానుంది. ఈ మేరకు మూవీ టీమ్ అధికారికంగా ప్రకంటించింది. థియేటర్లో మిస్ అయినవారు ఓటీటీలో చూడాలని కోరింది.
Gopichand's hit movie Bheema in OTT... when and where?
Bheema: మ్యాచీవ్ స్టార్ గోపిచంద్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం భీమా. ఈ మూవీకి ఎ.హర్ష దర్శకత్వం వహించారు. ఈ ఏడాది మార్చి 8 న థియేటర్లో విడులైంది. ప్రేక్షకుల అంచనాలను అందుకుంది. ఇందులో గోపిచంద్ డబుల్ యాక్షన్తో మెప్పించాడు. తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ+హాట్స్టార్ వేదికగా ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో ప్రియాంక భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు. వెన్నెల కిషోర్, రఘుబాబు, నాజర్, నరేష్ కీలకపాత్రలు పోషించారు. ఈ మేరకు మూవీ టీమ్ అధికారికంగా ప్రకంటించింది. థియేటర్లో మిస్ అయినవారు ఓటీటీలో చూడాలని కోరింది.
కథ విషయానికి వస్తే.. మహేంద్రగిరి అనే ఊరిలో పరశురామ క్షేత్రం చాలా గొప్ప స్థల పురానం ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం చుట్టు జరిగే కథే భీమా. ఆ ప్రాంతంలో భవానీ (ముఖేష్ తివారి) ముఠా ఎన్నెన్నో అరాచకాలు చేస్తుంటారు. వారికి అడ్డొచ్చిన పోలీసులను అంతం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తారు. అలా ఒక ఎస్ఐ హత్య అనంతరం అదే ప్రాంతానికి భీమా (గోపిచంద్) పోలీసు ఆఫీసర్గా వస్తాడు. భవానీ ముఠా ఆట కట్టించేందుకు భవాని ప్రయత్నిస్తాడు. అటవీ ప్రాంతం నుంచి ఈ ముఠా తీసుకెళుతున్న ట్యాంకర్లపై నిఘా పెడుతారు. ముఖ్యంగా వాటి గురించే సినిమా ఉంటుంది. అసలు ఆ ట్యాంకర్లలో ఏం ఉంది. పరశురామ క్షేత్రం చరిత్ర ఏంటి..అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.