»Bhairava Bujji Is Very Special All Crores At Once
Bhairava-Bujji: ‘భైరవ-బుజ్జి’ చాలా స్పెషల్.. ఏకంగా అన్ని కోట్లా?
ప్రస్తుతం ఎక్కడ చూసిన బుజ్జి గురించే చర్చ జరుగుతోంది. అసలు బుజ్జి కోసం స్పెషల్ ఈవెంట్ చేస్తున్నారంటే.. అది ఎంత స్పెషలో అర్థం చేసుకోవచ్చు. అయితే.. బుజ్జి కోసం మేకర్స్ కోట్లు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తోంది.
'Bhairava-Bujji' is very special.. All crores at once?
Bhairava-Bujji: టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న కల్కి సినిమాలో.. ప్రభాస్ వాడే వెహికల్ పేరు బుజ్జి. కథలో బుజ్జి పాత్ర చాలా కీలకంగా ఉండనుంది. ఈ బుజ్జి కార్ని స్క్రాచ్‌తో చాలా అద్భుతంగా డిజైన్ చేసినట్టుగా చెబుతున్నారు. కల్కి సినిమా మొదలుపెట్టినప్పుడు కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్, మహేంద్ర అధినేత ఆనంద్ మహేంద్రని కలిసి స్పెషల్‌గా వెహికల్స్ డిజైన్ చేయించుకున్నాడు. అందులో.. బుజ్జి కోసం ఏకంగా 7 కోట్లు ఖర్చుపెట్టినట్టుగా తెలుస్తోంది. సినిమాకే బుజ్జి హైలెట్‌గా నిలుస్తుందని అంటున్నారు. దీనికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయట. బుజ్జి గాల్లోకి కూడా ఎగురుతుందట. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కోసం స్పెషల్‌గా రెండు కోట్లు పెట్టి బులెట్స్ పేల్చే జాకెట్ కూడా తయారుచేశారని తెలుస్తుంది. ఇదే కాదు.. సినిమాలో చాలా వింతలు విశేషాలు ఉంటాయని అంటున్నారు. ఈ లెక్కన కల్కిని ఏ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఈరోజు సాయంత్రం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ఈవెంట్లో బుజ్జిని ప్రేక్షకులకు పరిచచయం చేయబోతున్నారు. చిత్ర యూనిట్ బుజ్జికి ఇస్తున్న హైప్ చూసి.. చాలా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఇక సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సలార్ వంటి మాసివ్ హిట్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటు.. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అవడంతో.. కల్కి పై అంచనాలు భారీగా ఉన్నాయి. జూన్ 27న రిలీజ్ కానున్న కల్కి 2898AD సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీద్ దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఖచ్చితంగా కల్కి ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. మరి కల్కి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.