»Pakistan Pakistanis Thank Indian Navy For Saving Sailors
Pakistan: నావికులను రక్షించిన భారత నౌకదళం.. థ్యాంక్స్ చెప్తున్న పాకిస్థానీలు
సోమాలియా దుండగుల దాడి నుంచి పాకిస్థాన్ నౌకను ఐఎన్ఎస్ యుద్ధనౌక సుమిత్రా రక్షించింది. ఇందులో ప్రయాణిస్తున్న 19 మంది పాకిస్థానీయులను కాపాడింది. అయితే సోమాలియా సముద్రపు దొంగల నుంచి తమను రక్షించినందుకు పాకిస్థాన్, ఇరాన్ సిబ్బంది భారత నావికాదళానికి ధన్యవాదాలు తెలిపారు.
Pakistan: ఇరాన్ ఫిషింగ్ నౌకను కాపాడిన తర్వాత భారత నౌకాదళం మరో ఆపరేషన్ చేపట్టింది. సోమాలియా దుండగుల దాడి నుంచి పాకిస్థాన్ నౌకను ఐఎన్ఎస్ యుద్ధనౌక సుమిత్రా రక్షించింది. ఇందులో ప్రయాణిస్తున్న 19 మంది పాకిస్థానీయులను కాపాడింది. అయితే సోమాలియా సముద్రపు దొంగల నుంచి తమను రక్షించినందుకు పాకిస్థాన్ జాలర్లు భారత నేవీ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే జాగ్రత్తగా వెళ్లండి అంటూ.. ఇండియన్ నేవీకి వీడ్కోలు పలికారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Indian Naval warships mission deployed in the #IOR are ensuring security against all #maritime threats, keeping our seas safe for mariners of all… pic.twitter.com/n2dAOg6jw6
అల్ నయిమి అనే పాకిస్థాన్‌కు చెందిన ఫిషింగ్ నౌకపై సోమాలియాకు చెందిన 11 మంది దుండగులు దాడి చేశారు. అరేబియా సముద్రంలో కొచ్చికి పశ్చిమాన సుమారు 800 నాటికల్ మైల్స్ దూరంలో పాకిస్థాన్‌కు చెందిన నౌకపై దాడి చేశారు. 36 గంటల కంటే తక్కువ సమయంలో ఐఎన్ఎస్ సుమిత్ర సోమాలియా దుండగులను పట్టుకుంది.