»Complaint To Hrc On Bigg Boss Showbigg Boss Telugu %e0%b0%ac%e0%b0%bf%e0%b0%97%e0%b1%8d %e0%b0%ac%e0%b0%be%e0%b0%b8%e0%b1%8d %e0%b0%b7%e0%b1%8b%e0%b0%aa%e0%b1%88 %e0%b0%b9%e0%b1%86%e0%b0%9a%e0%b1%8d
Bigg Boss Telugu: బిగ్ బాస్ షోపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
బిగ్ బాస్ షోపై మానవ హక్కుల కమిషన్లో కేసు నమోదు అయింది. రియాలిటీ షో ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని, నిర్వాహకుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించిందని, గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన ఘర్షణలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అయ్యాయి అని హైకోర్టు న్యాయవాది అరుణ్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు.
Bigg Boss Telugu: బుల్లితెరపై సంచలనం సృష్టించిన బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్(Bigg Boss). ఇప్పటికే 7 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షోపై పాజిటివిటీ ఎంత ఉందో నెగిటివిటీ కూడా అంతే స్థాయిలో ఉంది. ఫస్ట్ సీజన్ నుంచే వివాదాస్పదం అవుతోంది. ఈ కార్యక్రమాన్ని నిషేధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇటీవల బిగ్ బాస్ ఏడో సీజన్ ముగిసిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట నానా హంగామా జరిగింది. ఈ షోపై హెచ్ఆర్సీలో కేసు నమోదు అయింది.
హైకోర్టు న్యాయవాది అరుణ్.. బిగ్ బాస్ షో నిర్వాహకులపై మానవ హక్కుల కమిషన్కు కంప్లైంట్ చేశారు. బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే రోజు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, అమర్ దీప్ అభిమానుల మధ్య ఎంత పెద్ద ఘర్షణ జరిగిందో అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని న్యాయవాది అరుణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి కారణం బిగ్ బాస్ నిర్వాహకుల నిర్లక్ష్యం అని ప్రస్తావించారు. ఈ కార్యక్రమం ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని కంప్లైంట్ ఇచ్చారు. గొడవలో విన్నర్ ప్రశాంత్(Pallavi Prashanth)పై కూడా కేసులు నమోదు అయ్యాయి. బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున(Nagarjuna)పై కూడా కేసు ఫైల్ చేయాలాని అరుణ్ తెలిపారు. ఎనిమిది ఆర్టీసీ బస్సుల, కార్లు ధ్వంసం అయ్యాయని వివరించారు.