Four People Arrested In Actress Rashmika Mandanna Deepfake Video Case
Rashmika Mandanna: సినీ సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna) వీడియో రావడంతో సినీ ఇండస్ట్రీ ఉలిక్కి పడింది. తర్వాత అలియా భట్, కాజోల్ డీప్ ఫేక్ వీడియోలు కూడా వచ్చాయి. రష్మిక ఇష్యూకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.
ఆ వీడియో సర్క్యులేట్ చేసిన యూజర్ ఎవరో చెప్పాలని మెటాకు లేఖ రాయగా.. కంపెనీ స్పందించి ఇన్ఫో ఇచ్చింది. దీంతో బీహార్‌కు చెందిన యువకుడు షేర్ చేశారని గుర్తించారు. అసలు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రష్మిక వీడియో సర్క్యులేట్ చేసిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో అసలు నిందితుడు మాత్రం లేడట.. అతని కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రముఖులు డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. క్రమంగా ఒక్కో సెలబ్రిటీ వీడియో బయటకు రాగా.. ఆ వీడియో రూపొందించిన వారిపై గట్టి చర్యలకు కేంద్రం ఉపక్రమించింది.