»Salaar Collections Before The Release How Many Crores Have Come In Advance Booking
Salaar: విడుదలకు ముందే కలెక్షన్లు.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల కాకముందే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
Salaar: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో సందడి చేయనుంది. రిలీజ్ కాకుండానే ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నిన్న రాత్రి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా.. బుక్ మై షో యాప్ క్రాష్ అయిన విషయం తెలిసిందే. తర్వాత ఒక్కో థియేటర్ టికెట్లను విడుదల చేసింది. సలార్ మూవీ టికెట్లు దేశ వ్యాప్తంగా 6,78,292కు పైగా అమ్ముడయ్యాయి. సినిమా విడుదల కాకుండానే రూ. 14.88 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. రిలీజ్ కాకుండానే కాసుల వర్షం కురిపిస్తోంది.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన డంకీ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది. ఈ మూవీకి దేశవ్యాప్తంగా 3,41,500 టికెట్లు అమ్ముడు కాగా.. రూ. 10.70 కోట్లు వచ్చాయట. అడ్వాన్స్ బుకింగ్స్‌లో డంకీని క్రాస్ చేసి మరి సలార్ రికార్డులు సృష్టిస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో ప్రభాస్ సరసన హీరోయిన్గా శ్రుతిహాసన్ నటించింది. తెలంగాణ రాష్ట్రంలో స్పెషల్ షో నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతి కల్పించింది. ఏపీలో స్పెషల్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.