»Lokesh Kanagaraj Shocking Is Lokesh Kanagaraj In A Bad Mood A Case In Court
Lokesh Kanagaraj: షాకింగ్.. లోకేష్ కనగరాజ్ మానసిక స్థితి బాలేదా? కోర్టులో కేసు
సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి డైరెక్టర్ మానసిక స్థితి బాగలేదంటూ కోర్టులో కేసు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు.. లోకేష్ కేసు కహానీ ఏంటి?
Lokesh Kanagaraj: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి అందరికీ తెలిసిందే కదా. తనకంటూ ఒక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసుకొని సెన్సేషనల్ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే లోకేష్ కనగరాజ్ టాప్ ప్లేస్‌లో ఉంటాడు. ఇప్పటి వరకు కేవలం ఐదు చిత్రాలు మాత్రమే చేసిన లోకేష్.. అతి తక్కువ సమయంలోనే స్టార్ డైరెక్టర్ లిస్ట్‌లోకి అయిపోయాడు. నగరం తర్వాత లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా ఖైదీ, విక్రమ్ సినిమాలు చేశాడు. మధ్యలో స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్‌గా విజయ్‌తో మాస్టర్ సినిమా చేశాడు.
ఈ సినిమా ఫ్లాప్ అవడంతో.. మరోసారి ఎల్సీయూలో భాగంగా విజయ్‌తో ‘లియో’ సినిమా చేశాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా.. టాక్‌తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్‌తో తలైవార్ 171 ప్రాజెక్ట్ చేస్తున్నాడు లోకేష్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. కానీ లోకేష్ మానసిక స్థితి బాగలేదంటూ కోర్టులో కేసు వేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. లియో సినిమా విషయంలో లోకేశ్ పై మధురై హైకోర్టు బెంచ్‌లో పిటిషన్ దాఖలైంది. విజయ్ నటించిన లియో సినిమా హింసను ప్రేరేపించే విధంగా ఉందంటూ.. మధురైకు చెందిన రాజు మురుగన్ అనే వ్యక్తి మధురై హైకోర్టులో ఫిర్యాదు చేశారు.
లోకేష్ కనగరాజ్ మానసిక పరిస్థితి బాగా లేదని.. అతనికి సైకలాజికల్ పరీక్షలు నిర్వహించాలని కోరారు. అంతేకాదు.. సినిమాలో మారణాయుధాలు, డ్రగ్స్, మతపరమైన చిహ్నాలు, మహిళలు, చిన్నారులపై హింసను ప్రేరేపించే సన్నివేశాలు ఉన్నాయని.. వెంటనే లియో సినిమాను బ్యాన్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే బుధవారమే ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. కానీ లోకేష్ తరపు న్యాయవాదులు హాజరు కాకపోవడంతో ఈ కేసును వాయిదా వేసింది. దీంతో ఈ కేసు విషయంలో ఎలాంటి తీర్పు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.