»Jitendra Awhad Rama Is A Carnivore The Ncp Leaders Comments Are Causing Outrage
Jitendra Awhad: రాముడు మాంసాహారి.. తీవ్ర దుమారం రేపుతున్న ఎన్సీపీ నేత వ్యాఖ్యలు
ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ శ్రీరామునిపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 22న అయోధ్య రామమందిరం ప్రారంభించనున్నారు. అయితే జనవరి 22న డ్రై డేగా, మాంసాహార నిషేధ దినోత్సవంగా ప్రకటించాలని జితేంద్ర డిమాండ్ చేశారు.
Jitendra Awhad: మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ శ్రీరామునిపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ నెల 22న అయోధ్య రామమందిరం ప్రారంభించనున్నారు. అయితే జనవరి 22న డ్రై డేగా, మాంసాహార నిషేధ దినోత్సవంగా ప్రకటించాలని జితేంద్ర డిమాండ్ చేశారు. రాముడు 14 ఏళ్లు అడవులో నివసించాడు. అక్కడ జంతువులను వేటాడి మాంసాన్ని తినేవారని.. కేవలం శాఖాహారమే ఎలా తినగలిగాడని వ్యాఖ్యానించారు.
రాముడు బహుజనులకు చెందినవాడు. అతను జంతువులను వేటాడి తినేవాడు. రాముడిని ఉదాహరణకు చూపి ప్రతి ఒక్కరినీ శాఖాహారులుగా మార్చడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అతనిపై పలువురు వ్యక్తులు మండిపడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను రామ భక్తులు, బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎన్సీపీ నేతపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో అవద్ క్షమాపణలు కోరారు. తొందరపడి మాట్లాడలేదని.. రామాయణంలో ఉన్నదే చెప్పానంటూ తెలిపారు.