Hi Nanna: నెల రోజుల్లోపే ఓటిటిలోకి వచ్చేసిన ‘హాయ్ నాన్న’!
న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ హాయ్ నాన్న. బాక్సాఫీస్ దగ్గర క్లాసికల్ హిట్‌గా నిలిచిన హాయ్ నాన్న.. నెల రోజులు తిరక్కుండానే ఓటిటిలోకి వచ్చేసింది. మరి ఏ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
Hi Nanna: ఓ మాస్ సినిమా.. ఓ క్లాస్ సినిమా చేస్తున్న నాని.. దసరా వంటి మాస్ సినిమా తర్వాత కంప్లీట్‌గా క్లాస్ లుక్‌లోకి వచ్చి చేసిన మూవీ హాయ్ నాన్న. సీతారామం తర్వాత మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాతో.. శౌర్యువ్ అనే మరో టాలెంటెడ్ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమా పై సెలబ్రిటీస్ సైతం ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా హాయ్ నాన్న సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది.
దాదాపు 70 కోట్లకుపై పైగా కలెక్ట్ చేసిన హాయ్ నాన్న.. బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అయితే.. నెల రోజులు తిరగకుండానే ఓటిటిలోకి వచ్చేసింది హాయ్ నాన్న సినిమా. డిసెంబర్ 7న థియేటర్లోకి వచ్చిన హాయ్ నాన్న.. జనవరి 4 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దీంతో ప్రస్తుతం ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్‌లోకి అందుబాటులోకి వచ్చేసింది. తెలుగు సహా ఇతర పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్కి వచ్చేసింది. అందుకు సంబంధించిన సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
థియేటర్లో ఈ సినిమాను చూడలేకపోయిన వారంతా.. ఓటిటిలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మంచి రిపీట్ వాల్యూ ఉన్న సినిమా కావడంతో.. థియేటర్స్‌లో చూసిన వాళ్లు కూడా హాయ్ నాన్న సినిమాని ఓటీటీలో చూడడం గ్యారెంటీ. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాద్ సంగీతం అందించగా కొత్త నిర్మాణ సంస్థ వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.