»Vaishnavi Chaitanya Tillugadito Baby Beauty First Look Release
Vaishnavi Chaitanya: టిల్లుగాడితో బేబీ బ్యూటీ.. ఫస్ట్ లుక్ రిలీజ్!
బేబీ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న వైష్ణవి చైతన్యకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాజెక్ట్స్ ఓకె చేసిన బేబీ.. డీజె టిల్లుతో నటించే ఛాన్స్ కొట్టిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ఫస్ట్ లుక్‌ని రివీల్ చేశారు.
Vaishnavi Chaitanya: బేబీ సినిమాతో కుర్రకారు హాట్ ఫేవరేట్‌గా నిలిచింది యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య. దీంతో టాలీవుడ్ హాట్ కేక్‌గా మారిపోయింది అమ్మడు. వైష్ణవికి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇప్పటికే గీతా ఆర్ట్స్ లాంటి బడా సంస్థ బేబీ డేట్స్ లాక్ చేసుకుంది అంటే.. వైష్ణవి క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. రీసెంట్గా దిల్ రాజు బ్యానర్లో కూడా అడుగుపెట్టింది. అలాగే.. డీజె టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ జోడీగా బేబీ ఓ సినిమాలో నటిస్తోంది. డీజె టిల్లుతో సాలిడ్ హిట్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ.. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ టిల్లు స్క్వేర్తో బిజీగా ఉన్నాడు.
రాధికగా నటించిన నేహాశెట్టి ప్లేస్‌లో అనుపమా పరమేశ్వరన్గా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత వరుస ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్నాడు సిద్ధు. అందులో ఓ ప్రాజెక్ట్ బొమ్మరిల్లు భాస్కర్‌తో కమిట్ అయ్యాడు. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా వైష్ణవి చైతన్య ఫిక్స్ అయ్యినట్టుగా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర వారు కన్ఫర్మ్ చేసారు. ఈరోజు వైష్ణవి పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విష్ చేస్తూ.. ఆమె లుక్ రివీల్ చేశారు.
ఈ పోస్టర్లో వైష్ణవి బ్లాక్ డ్రెస్‌లో చాలా క్యూట్‌గా కనిపిస్తోంది. ఇందులో డిఫరెంట్ రోల్లో కనిపిస్తున్నట్టుగా ఉంది. ప్రస్తుతం వైష్ణవి కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమెకు బర్త్ డే విష్ చేస్తూ.. నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మరి టిల్లుగాడితో బేబీ రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.