»Love Me Dil Rajus Love Story With A Demon Release Date Fixed
Love Me: దెయ్యంతో దిల్ రాజు లవ్ స్టోరీ.. రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండు బ్యానర్లపై వరుస సినిమాలు నిర్మిస్తున్నాడు. లేటెస్ట్గా దెయ్యంతో లవ్ స్టోరీ అంటూ.. లవ్ మీ అనే కొత్త సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.
Love Me: Dil Raju's love story with a demon.. release date fixed!
Love Me: ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు కుటుంబం నుంచి నిర్మాతలే కాదు.. హీరో కూడా ఉన్నాడని రౌడీ బాయ్స్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఆశిష్. దిల్ రాజు సోదరుని కుమారుడు అయినటువంటి ఆశిష్.. ఇప్పుడు రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌తో కలిసి సెల్ఫీష్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే.. లవ్ మీ అనే సినిమా కూడా చేస్తున్నాడు. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాకు అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించాడు.
శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే.. ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది. దీంతో.. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. నెల రోజులు వాయిదా వేస్తూ.. మే 25న లవ్ మీ సినిమా విడుదల కాబోతుంది.. అంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఓ కుర్రాడు దెయ్యాన్ని ప్రేమించాలనుకుంటాడు? అందుకోసం ఏం చేశాడు? అనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. మరి దెయ్యంతో లవ్ స్టోరీ జనాలకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.