»Censors New Guidelines Are Hurting The Industries
Censor Certificate: సెన్సార్ గైడ్ లైన్స్ తో నిర్మాతలకు చిక్కులు తప్పవా..?
సెన్సార్ బోర్డ్ కఠిన చర్యలు లేదా కొన్ని సినిమాల సెన్సార్‌షిప్‌లో జాప్యం వల్ల సినిమాలు ప్రభావితం కావడం కొత్తేమీ కాదు. అయితే ఇప్పుడు అన్ని రకాల సినిమాలకు చిక్కులు వచ్చేలా కనపడుతున్నాయి. తాజాగా, సెన్సార్ కొత్త మార్గదర్శకాలు తీసుకురాగా.. అవి పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయి.
Censor Certificate: సెన్సార్ బోర్డ్ కఠిన చర్యలు లేదా కొన్ని సినిమాల సెన్సార్‌షిప్‌లో జాప్యం వల్ల సినిమాలు ప్రభావితం కావడం కొత్తేమీ కాదు. అయితే, చాలా వరకు వివాదాస్పద అంశాలతో లేదా నిజ జీవిత సమస్యలకు సంబంధించిన సినిమాలు మాత్రమే సెన్సార్‌లో ఇబ్బందులను ఎదుర్కొంటాయి. అయితే ఇప్పుడు అన్ని రకాల సినిమాలకు చిక్కులు వచ్చేలా కనపడుతున్నాయి. తాజాగా, సెన్సార్ కొత్త మార్గదర్శకాలు తీసుకురాగా.. అవి పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయి. ఇటీవల KGF సిరీస్ సృష్టికర్త ప్రశాంత్ నీల్ సలార్‌కు A సర్టిఫికేట్ ఇచ్చినందుకు బాగా హర్ట్ అయ్యారు. U/A సర్టిఫికేట్ ఇవ్వడానికి సెన్సార్ టీమ్ మల్టిపుల్ కట్స్ అడగడంతో బలవంతంగా A సర్టిఫికేట్ తీసుకోవాలని, మార్గదర్శకాలను మార్చినట్లు అతను ఇటీవల చెప్పాడు.
సలార్‌కి యాక్షన్ సన్నివేశాలు కీలకం కావడంతో ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ వాటిని ఉంచాలని భావించి A సర్టిఫికెట్‌ని ఎంచుకున్నారు. సెన్సార్ బోర్డ్ ప్రభావితమైన తాజా చిత్రాలు ధనుష్ కెప్టెన్ మిల్లర్ , వెంకటేష్ సైంధవ్. సెన్సార్ కొత్త మార్గదర్శకాలు పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయి. సెన్సార్ బృందం పలు కట్లను సూచించింది. కెప్టెన్ మిల్లర్ క్లైమాక్స్‌లోని 4 నిమిషాల యాక్షన్ సన్నివేశాన్ని కత్తిరించారు. ఇప్పుడు ఎ సర్టిఫికేట్ కోసం వెళ్లాలా లేదా యు/ఎ కోసం వెళ్లాలా అనే డైలమాలో యూనిట్ ఉంది.
కొత్త గైడ్‌లైన్స్ ప్రకారం, సెన్సార్ టీమ్ కొన్ని బ్లడీ యాక్షన్ పార్ట్లు ఉన్న చోట ట్రిమ్ చేస్తోంది, కానీ ముందు అది అలా కాదు. గతంలో U/A సర్టిఫికేట్ కోసం సెన్సార్ బోర్డ్ అధికారులు కొన్ని కస్ వర్డ్స్, యాక్షన్ ఎపిసోడ్లలో బ్లడ్ షాట్లను అనుమతించేవారు. కానీ ఇప్పుడు వారు నిర్దాక్షిణ్యంగా ప్రతిదీ ట్రిమ్ చేస్తున్నారు. కాబట్టి భారీ డోస్ యాక్షన్‌తో డీల్ చేస్తే చిత్ర బృందాలు A సర్టిఫికేట్ కోసం వెళ్లవలసి వస్తుంది. మరి ఈ సమస్య నుంచి చిత్ర యూనిట్ ఎలా బయటపడుతుందో చూడాలి.