»The Supreme Court Gave A Shock To The Filmmakers Movies Should Not Contain Such Scenes
Supreme Court: ఫిల్మ్ మేకర్స్‌కు సుప్రీం కోర్టు షాక్ .. ఇకపై అలాంటి సన్నివేశాలు ఉండకూడదు
సినిమాల్లో, డిజటల్ కంటెంట్ సిరీస్‌లలో కొన్ని పదాలను వాడొద్దని సుప్రీం కోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇవి దృష్టిలో పెట్టుకొని చిత్రీకరణ చేయాలని లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.
The Supreme Court gave a shock to the filmmakers.. Movies should not contain such scenes
Supreme Court: సినిమాలు సమాజంపై ప్రభావం చూపుతాయన్న విషయం తెలిసిందే. అందరూ వాటిని అనుసరిస్తారు అని కానీ కొన్ని సున్నితమైన విషయాల్లో ఫిల్మ్ మేకర్స్ జాగ్రత్తలు తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ‘అవిటివాడు’, ‘స్పాస్టిక్’ వంటి పదాలు వాడకూడదు అని, అలాగే వారి పట్ల సున్నితంగా వ్యవహరించాలని పేర్కొంది. సాధారణంగానే వారు సమాజంలో వివక్ష ఎదుర్కొంటారు, అలాంటి వారిని మరింత సామాజిక వివక్షకు గురయ్యేలా చేస్తాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, సీరియల్స్ అన్ని దృశ్య మాధ్యమాల్లో దివ్యాంగులను కించపరిచేలా సన్నివేశాలు చిత్రీకరించొద్దని చెప్పింది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.
సెన్సార్ సభ్యులకు కూడా కీలక సూచనలు చేసింది. సినిమా స్క్రీనింగ్‌కు అనుమతించే ముందు సర్టిఫికేట్ ఇచ్చే సీబీఎఫ్సీ నిపుణులు నిర్భయంగా తమ అభిప్రాయాన్ని చెప్పాలని, వాటిని తప్పనిసరిగా మేకర్స్ తీసుకోవాలని సూచించింది. అయితే దివ్యాంగులపై జరుగుతున్న వాస్తవాలను చిత్రీకరించే విధంగా ఉంటే, వారిని ప్రోత్సహించే విధంగా సీన్లు ఉంటే బాగుంటుందని తన అభిప్రాయాన్ని తెలిపింది. అలాగే దివ్వాంగులు కేవలం సవాళ్లు మాత్రమే కాకుండా వారి, ప్రతిభ, సమాజానికి చేసిన సేవను చూపించాలని న్యాయస్థానం తెలిపింది. ఈ ప్రస్తావనకు కారణం ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘ఆంఖ్ మిచోలీ’లో దివ్యాంగులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని నిపున్ మల్హోత్రా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు వేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారించి తీర్పును వెల్లడించింది.