»Vaishnavi Chaitanya Will Not Get Opportunities Because
Vaishnaviకి రానీ అవకాశాలు.. ఎందుకంటే..?
బేబీ మూవీ తర్వాత హీరోయిన్ వైష్ణవి చైతన్యకు సినిమా అవకాశాలు రాలేదు. తిరిగి యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్ చేయలేని పరిస్థితి. సినిమాల్లో ఛాన్స్ వస్తోన్న.. హీరోయిన్గా కాకుండా సైడ్ రోల్స్ రావడంతో.. చేయనని తెగేసి చెబుతుందట అమ్మడు.
Vaishnavi Chaitanya will not get opportunities.. because..?
Vaishnavi Chaitanya: బేబీ మూవీ హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya).. అంతకుముందు వెబ్ సిరీస్, యూట్యూబ్ షార్ట్స్ చేసేది. సినిమాల్లో చిన్న, చిన్న పాత్రలు కూడా చేసింది. తన యూట్యూబ్ చానెల్లో వీడియోలు చేసుకుని చక్కగా ఉండేది. ఎప్పుడైతే బేబీ మూవీలో ఆఫర్ వచ్చిందో.. ఆ తర్వాత పరిస్థితి మారింది. హీరోయిన్ స్టేటస్ వచ్చింది.. ఆ సినిమా కూడా వంద కోట్ల క్లబ్లో చేరింది. ఆ దర్శక నిర్మాతలు మరో మూవీలో ఆఫర్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు. ఇప్పుడు బేబీ హీరోయిన్‌కు సినిమా అవకాశాలు లేక ఖాళీగా ఉంది.
హీరోయిన్ రోల్ కోసం వైష్ణవి చైతన్య కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. గతంలో చేసిన సైడ్ రోల్స్ ఇస్తామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఆ ఆఫర్లను వైష్ణవి తోసిపుచ్చింది. ఇంకేముంది ఆ చిన్న పాత్రలు కూడా లేకుండా పోయాయి. బేబీ మూవీ తన జీవితంలో మార్పు తెస్తుందని భావించగా.. ఏ ఆఫర్ లేకుండా చేసిందని ఆ అమ్మడు భావిస్తోందట. బిజీ అవుతానని అనుకుంటే.. ఏ మూవీ లేక ఉండాల్సి వస్తోందని అంటున్నారు. ఆ సినిమా చేసిన తర్వాత నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ వచ్చాయని ఫ్రెండ్స్ చెప్పారని వైష్ణవి అంటున్నారు.
వైష్ణవి యూట్యూబ్‌లో లవ్ ఇన్ 143 అవర్స్, ద సాప్ట్ వేర్ డెవలపర్, ఆరెరె మానస, మిస్సమ్మ షార్ట్ ఫిల్మ్స్ తీశారు. సాప్ట్ వేర్ డెవలపర్ మంచి క్రేజ్ వచ్చింది. హీరోయిన అయిన తర్వాత ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ తీయలేనని వైష్ణవి అంటున్నారు. సినిమాలో మెయిన్ రోల్ లేక ఇబ్బంది పడుతోంది. కానీ ఆమె వంక ఏ దర్శక, నిర్మాత చూడటం లేదు. మరో ఛాన్స్ అంటూ ధీనంగా చూస్తోంది పాపం వైష్ణవి చైతన్య. ఇకనైనా ఆఫర్ వస్తుందో లేదో చూడాలి మరీ.