ELR: పెదవాగు రిజర్వాయర్‌కు వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏలూరు కలెక్టరేట్లో 1800-233-1077, 94910 41419, జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఆఫీస్‌లో 83092 69056, వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో 8328696546 మూడు చోట్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామని కలెక్టర్ కె. వెట్రిసెల్వి శనివారం తెలిపారు. అత్యవసర సమయంలో ఈ నంబర్లను సంప్రదించాలని కోరారు.