కోనసీమ: కూటమి ప్రభుత్వపై కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కామన ప్రభాకరరావు విమర్శలు గుప్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం మాత్రం అందుబాటులో ఉన్నాయని ప్రకటనలు చేస్తోందని విమర్శించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 15న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని పేర్కొన్నారు.