ADB: తలమడుగు మండల కేంద్రానికి చెందిన దాసరి ప్రశాంత్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మాల సంక్షేమ సంఘం మండల నాయకులు ఆదివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తమవంతుగా రూ. 10వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భవిష్యత్తులో అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శశికాంత్, గజానంద్ తదితరులున్నారు.