అన్నమయ్య: జిల్లా చిట్వేలులో రోడ్ల భవనాల శాఖ కార్యాలయం నిర్లక్ష్యానికి గురైంది. చుట్టూ కంచెలు పెరిగి, పాడుబడిన బంగ్లాగా కనిపిస్తోంది. అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. మండలంలో సిమెంట్, ఇసుక, కంకర తరలింపు పనులు తప్ప ఇతర పనులు జరగడం లేదని, అధికారులు కార్యాలయానికి రాకుండా పనులను పర్యవేక్షించడం లేదని దుయ్యబట్టారు.