NTR: గంపలగూడెం మండలం పెనుగొలనులో ఆదివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జాతీయ హిందీ భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. భారత దేశ అధికార భాషగా మార్చటానికి కృషి చేసిన రాజేంద్ర సింహా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో దేశంలోని ప్రజలందరినీ ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు ఎంతో ఉపయోగపడిందని పలువురు తెలిపారు.