పాకిస్థాన్‌పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన కుల్దీప్ యాదవ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు. తన స్పెల్‌లో 4 ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో పాక్ బ్యాటింగ్‌ను పూర్తిగా దెబ్బతీసి, భారత్ విజయాన్ని సులభతరం చేశాడు.