TG: ముషీరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వినోదా నగర్ నాలాలో సన్నీ అనే యువకుడు పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, హైడ్రా బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టాయి. నాలాలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.