ఢిల్లీలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కేంద్ర ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రటరీ నవజోత్ సింగ్(45) మరణించారు. కంటోన్మెంట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ BMW కారు సింగ్ ప్రయాణిస్తున్న బైకును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆయన భార్య, కారులో ఉన్న దంపతులకు గాయాలయ్యాయి. కారును ఓ మహిళ నడుపుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.