ఆసిఫాబాద్: సిర్పూర్( టీ)నూతన SI గా సోమవారం CH సురేష్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా సురేష్ మాట్లాడుతూ.. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలు పరిరక్షించడానికి కృషి చేస్తానని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. అక్రమ వ్యాపారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.