SRD: 2012 కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ.. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రావిణ్యకు సోమవారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు దత్తాత్రి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సుధాకర్ పాల్గొన్నారు.