MNCL: మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఈనెల 19న జిల్లా స్థాయి బోధన అభ్యసన మేళా(TLM మేళా) నిర్వహించనున్నట్లు DEO యాదయ్య ప్రకటనలో తెలిపారు. ఈనెల 20న నిర్వహించాల్సిన మేళాను 19కు మార్చినట్లు తెలిపారు. ప్రతీ మండలం నుంచి ఎంపికైన TLM ప్రదర్శనలు తీసుకుని ఉదయం 9గంటలకు సంబంధిత ఉపాధ్యాయులందరూ రావాలని సూచించారు.