అన్నమయ్య: చిన్నమండెం మండలం చాకిబండ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న BV. శ్రీధర్ రెడ్డి బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. విద్యార్థులకు పాఠాలు చెపుతుండగా ఒకసారిగా కుప్పకూలాడని, వెంటనే తోటి ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలిస్తుండగా దారి మధ్యలో చనిపోయారు. ఆయన మృతి పట్ల మండల వ్యాప్తంగా ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేశారు.