NZB: ఆలూరు పట్టణానికి చెందిన 13 ఏళ్ల గోసంగి గంగా వారం రోజులుగా అదృశ్యమైంది. గత 10వ తేదీ బుధవారం ఉదయం 6 గంటల సమయంలో ఇంటి నుంచి ‘ఆడుకుంటానని’ బయలుదేరిన బాలిక తిరిగి రాలేదు. గ్రీన్ కలర్ టీ-షర్ట్, బ్లాక్ కలర్ పాంట్ ధరించి ఉన్న బాలిక ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలిసినవారు 9581052773 నంబరుకు సంప్రదించాలన్నారు.