MDK: మనోహరాబాద్ జేఎంజే విద్యార్థినీలు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ అనిత తెలిపారు. జిల్లా స్థాయిలో జరిగిన పోటీలలో తమ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారని, వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అభినందించారు.