SRD: సింగూర్ ప్రాజెక్ట్‌లో వరద ఉధృతి నిరంతరంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 6 గంటల వరకు 50,751 క్యూసెక్కులు ఇన్ ఫ్లో కొనసాగగా, ఔట్ స్లో కూడా 50,751 క్యూసెక్కులు ఉందని ఇరిగేషన్ AEE జాన్ స్టాలిన్ తెలిపారు. ఆరు స్పిల్ వే ద్వారా 48,242 క్యూసెక్కులు, జెన్కో 1849, ఎడమ పంట కాల్వకు సాగునీళ్లు 120 క్యూసెక్కులు, మిషన్ భగీరథ, HMWS, నీటి ఆవిరి 540 క్యూసెక్కులు ఉంది.