BDK: పాల్వంచ మండలం సంతోషిని నాట్య నిలయం ఆధ్వర్యంలో జాతీయ స్థాయి భద్ర శైల డాన్స్, మ్యూజికల్ కాంపిటీషన్స్ నవంబర్ 8, 9 తేదీల్లో శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆయన క్యాంప్ కార్యాలయంలో జాతీయస్థాయి నృత్య పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు.