KRNL: ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామంలో మంగమ్మ కాలువ గట్టు వద్ద పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 9400 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఇస్వీ ఎస్సై డాక్టర్ నాయక్ తెలిపారు. అరెస్టయిన వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.