NLG: ప్రమాదవశాత్తు సాగర్ ఎడమ కాలువలో యువకుడు గల్లంతైన సంఘటన వేములపల్లి మండలం శెట్టిపాలెంలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం సాయంత్రం సతీష్ (32)నలుగురు యువకులతో కలిసి ఈతకు వెళ్లారు. రుత్విక్ అనే బాలుడు వరద ప్రవాహంలో కొట్టుకుపోతుండగా రక్షించబోయి సతీష్ గల్లంతయ్యాడు.