MDK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ రాహుల్ రాజ్ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలపై సమీక్షించారు. పరీక్షల నిర్వహణకు పక్కా ప్రణాళికతో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలు ఈ నెల 22 నుంచి 28 వరకు బాలికల హైస్కూల్ ఆవరణలో జరుగుతాయని, విద్యార్థులు పరీక్షలకు హాజరై ఉత్తీర్ణత సాధించాలని కోరారు.